మామ చేష్ట‌ల‌పై పెద‌వి విరిచేసిన కోడ‌లు

మ‌న్మ‌థుడి చేష్ఠ‌ల‌కు అవాక్కైన సామ్‌!

నాగార్జున అంటే మ‌న్మ‌థుడు.. గ్రీకు వీరుడు.. మ‌గువ‌ల గుండెల్లో రోమియో.. కానీ ఆ మీనింగ్ కూడా మార్చేస్తున్నారు ఈ సీనియ‌ర్ హీరో. నాగ్ లేటు వ‌య‌సులోనూ ప్లేబోయ్ లా ఏజ్‌ని కూడా మ‌రిచి యంగ్ బ్యూటీస్‌తో హ్యాపీగా లిప్ లాక్‌లు లాగించేశారు. నాగ్ ఈ వ‌య‌సులో ఇలా న‌టించ‌డాన్ని అభిమానులెవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రీ నాగ్ ఇంత‌గా చెల‌రేగాలా? అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌న్మ‌ధుడు 2 ఈ శుక్ర‌వారం రిలీజైంది. క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఇందులో రావు ర‌మేష్ పాత్ర ఎక్క‌డో కొడుతోంది చిన్నా.. అన్న‌ట్టుగానే సినిమా కూడా తేడా కొట్టిందని నెటిజ‌న్‌లు ఓ వైపు ట్రోల్స్ చేయ‌డం వేడి పెంచుతోంది.

అయితే ఈ విష‌యాన్ని ట్రైల‌ర్ రిలీజైన తొలి రోజే నాగ్ ముద్దుల కోడ‌లు స‌మంత ప‌సిగ‌ట్టేసింద‌ట‌. ట్రైల‌ర్‌లో వున్న స్ట‌ఫ్ చూసి సామ్ పెద‌వి విరిచేసింది. ఈ చిత్రంలో నాగ్ లిప్ లాక్‌ల‌తో రెచ్చిపోవ‌డం బొత్తిగా సామ్‌కు న‌చ్చ‌లేద‌ట‌. ఇదే విష‌యాన్ని మొహ‌మాటం లేకుండా చెప్పేసిందట‌. మామ‌ను ఈ త‌ర‌హాలో చూడ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని, ఆ లిప్‌లాక్ స‌న్నివేశాలు చాలా ఇడ్డందిక‌రంగా వున్నాయ‌ని ముఖంపైనే చెప్పేసింద‌ట‌. అయితే స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు త‌ప్ప‌లేద‌ని, సినిమా చూస్తే ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని క‌న్విన్స్ చేశార‌ట నాగార్జున‌. ఆ సంగ‌తిని చిత్ర బృందం చెబుతోంది. అంతేకాదు .. మామ న‌టించిన మ‌న్మ‌ధుడు 2 చిత్రాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ స‌మంత చూడ‌నేలేదు. లేటు వ‌యసులో ఆయ‌న ఇలా చేయ‌డం ఏం బాలేద‌న్న‌ది త‌న ఉద్ధేశ‌మా? అంటూ నెటిజ‌నులు ప్ర‌స్తుతం సామ్ పైనా ట్రోల్స్ చేస్తున్నారు.