బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు… ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుందని అయితే ఏడవ సీజన్ గురించి పెద్ద ఎత్తున ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ విషయంలో తరచూ ఏదో ఒక వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అనంతరం మూడవ సీజర్ నుంచి కింగ్ నాగార్జున ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున హోస్టింగ్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈయన కంటెస్టెంట్ లో పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. అందుకే వచ్చే సీజన్ కొత్త హోస్ట్ ని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా ఇప్పటికే పలువురు హీరోల పేర్లు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్,రానా వంటి హీరోల పేర్లు వచ్చాయి. అయితే తాజాగా మంచు హీరో పేరు కూడా ఇదే జాబితాలో చేరిపోయింది. మంచు మనోజ్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారని ఇప్పటికే నిర్వాహకులు ఆయనని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన నేటిజన్స్ బహుశా మంచు విష్ణు కంటెస్టెంట్ గా వెళ్తారేమో పొరపాటు పడ్డారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈయనకు యాంకర్ గా ఇలాంటి అనుభవం లేదని ఈయన కన్నా సోదరి లక్ష్మీప్రసన్న చాలా బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.