అక్కినేని కుటుంబంలో పేర్లకు ముందు నాగ ఉండడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం ఆయన వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇకపోతే ఇండస్ట్రీలో ప్రస్తుతం నాగార్జున ఆయన కుమారులతోపాటు మేనల్లులు కూడా హీరోలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే నాగార్జున కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరుకు ముందు నాగ అని ఉంటుంది ఇలా పేరుకు ముందు నాగ అని ఉండడానికి గల కారణం ఏంటనే విషయాన్ని నాగర్జున ఓ సందర్భంలో తెలియచేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు తన కడుపులో ఉన్న సమయంలో నాగేశ్వరరావు గారి తల్లికి తరచు పాములు కలలో కనిపించేట. ఇక నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా పాము పిల్లల తరచూ కనపడటంతో ఆమె ఏదైనా నాగదోషం ఉందనే ఉద్దేశంతో తన కుమారుడికి నాగేశ్వరరావు అని పేరు పెట్టారని నాగార్జున తెలిపారు. ఇక నాగేశ్వరరావు కూడా తన పిల్లలకు నాగార్జున నాగ సుశీల అంటూ పేర్లు పెట్టారు.

ఇక నాగార్జునకు తొలి సంతానమైన నాగచైతన్య పుట్టినప్పుడు నాగార్జున తనకు చైతన్య అని పేరు పెట్టాడట.అయితే తన నానమ్మ సూచన మేరకు నాగార్జున చైతన్యకు ముందు నాగ అని జత చేసి తనకు నాగ చైతన్య అనే పేరును పెట్టినట్లు నాగార్జున ఓ సందర్భంగా తెలియజేశారు. అయితే నాగార్జున రెండవ కొడుకు అఖిల్ కి మాత్రం నాగ అని జత చేయకపోవడంతో అఖిల్ కు అలాంటి పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.