దేశవ్యాప్తంగా నంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఆరు టెలివిజన్ సీజన్ లు ఒక ఓటిటి సీజన్ కూడా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుండి ఇటీవల ముగిసిన ఆరవ సీజన్ వరకు ప్రేక్షకులలో ఆకట్టుకుంటూ అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోయింది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఆరవ సీజన్ పూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా వీరిలో సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక యూట్యూబర్ గా ఫేమస్ అయిన శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడు.
అయితే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం నిలవాల్సి ఉంది. అయితే శ్రీహన్ 40 లక్షల రూపాయలకు ఆశపడి టైటిల్ ని కాదనుకున్నాడు. దీంతో రన్నర్ గా నిలవాల్సిన రేవంత్ విన్నర్ అయ్యాడు. అయితే ఇలా శ్రీహాన్ బిగ్ బాస్ టైటిల్ కాదనుకొని కేవలం 40 లక్షలకు ఆశపడటంతో అతని అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. టైటిల్ విన్నర్ గా శ్రీహాన్ ని చూడాలని అతని అభిమానులు ఓట్లు వేసి గెలిపిస్తే శ్రీహాన్ మాత్రం డబ్బులు తీసుకొని రన్నర్ గా బయటికి వచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటిల్ కాదనుకొని కేవలం డబ్బు తీసుకొని బయటికి రావటం వెనుక ఒక బలమైన కారణం ఉందని వెల్లడించాడు.
ఈ ఇంటర్వ్యూలో శ్రీహాన్ మాట్లాడుతూ.. నేను షో లోకి టైటిల్ గెలవాలని వచ్చాను. అందుకోసం చివరి వరకు పోరాడాను. కానీ నాగార్జున గారు 40 లక్షల సూట్ కేస్ ఆఫర్ చెప్పేసరికి మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల గుర్తుకు వచ్చి నేను ఆ డబ్బు తీసుకొని బయటికి రావాల్సి వచ్చింది అంటూ శ్రీహన్ వెల్లడించాడు. ఈ విషయంలో మా అమ్మ నిర్ణయాన్ని గౌరవిస్తూ మా అమ్మ తీసుకోమంటేనే నేను సూట్ కేస్ ఆఫర్ ని తీసుకున్నాను. అయితే మా ఫ్యామిలీకి ప్రస్తుతం డబ్బు అవసరం ఉంది.అందుకే నేను ఆ నలభై లక్షలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో నన్ను చాలామంది విమర్శిస్తున్నారు. కానీ ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు ఆ డబ్బులు చాలా అవసరం. అందువల్ల నేను ఆ నలభై లక్షల ఆఫర్ ని కాదనలేకపోయాను అంటూ అసలు కారణం వెల్లడించాడు.