కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కింగ్ నాగార్జున!

టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన , అక్కినేని నాగార్జున కరోనా వాక్సిన్ వేయించుకున్నారు. భారత దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి…. అలాగే… 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1వ తేది నుంచి కరోనా టీకా ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. తాజాగా నాగార్జున 60 ఏళ్లు పైబడిన జాబితాలో ఉండటంతో ఆయన కోవిడ్ టీకా తీసుకున్నారు.

Nagarjuna receives first dose of Covid-19 vaccine.

ఇప్పటికే దేశంలో మొదటి దశలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు, పోలీసులు, త్రివిధ దళాలు, పారిశుద్ధ కార్మికులకు కోవిడ్ టీకా మొదటి డోసు ఇచ్చారు. ప్రస్తుతం రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి టీకా వేస్తున్నారు. తాజాగా నాగార్జున నిన్న (మంగళవారం) కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పౌరుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా కంప్లీట్ చేసాడు. ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.