హీరోయిన్ మాజీ భర్తతో సాయి పల్లవి డేటింగ్?

హీరోయిన్ సాయి పల్లవి కొద్దిరోజుల క్రితం అసలు పెళ్లే చేసుకోనని ప్రకటించి సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె ఓ దర్శకుడితో డేటింగ్ లో ఉన్నట్టు కోలివుడ్ కోడై కూస్తుంది. అది కూడా ఓ మాజీ హీరోయిన్ భర్తతోనట.

హీరోయిన్  అమలాపాల్ గురించి తెలిసిందే. అమలాపాల్ విజయ్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకే వీరు విడిపోయారు. ప్రస్తుతం దర్శకుడిగా విజయ్ బిజి కాగా, అమలాపాల్ సినిమాలు చేస్తున్నారు. 

2018లో వచ్చిన కరు చిత్రానికి సాయి పల్లవి విజయ్ కలిసి పని చేశారు. అప్పటి నుంచి వీరి బంధం బలపడిందని తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని సమాచారం. సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్జీకే చిత్రం చేస్తుంది. మే 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ వార్తతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.