60 శాతం వసూళ్లు తగ్గితే కష్టమేనేమో!
ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ సాహో వసూళ్ల హవా సాగింది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా నెట్ వసూళ్లను సాధించి పెట్టిన పెట్టుబడి నుంచి ఆ మేరకు కాన్ఫిడెన్స్ నిచ్చింది. అయితే సోమవారం, మంగళవారం నుంచే అసలు కథ మొదలైందని చెబుతున్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం.. సోమవారం, మంగళవారం నాన్ హాలీడేస్ కాబట్టి 50-60 శాతం ఆక్యుపెన్సీలో తగ్గుదల కనిపించిందని చెబుతున్నారు. అంటే థియేటర్లలో సగం మంది మాత్రమే కనిపిస్తున్నారన్నమాట.
అయితే ఇది మునుముందు ఇంకా పెరిగితేనే పూర్తి స్థాయిలో బయ్యర్లు రికవరి అయ్యే ఛాన్సుంటుందని అంచనా వేస్తున్నారు. తొలి 10 రోజులు సాహో స్టడీగా కలెక్ట్ చేస్తేనే చాలా ఏరియాల్లో పంపిణీదారులు సేఫ్ అవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ నైజాంలో వసూళ్లు అదరగొట్టిందన్న టాక్ ఉన్నా అక్కడా సోమ మంగళవారానికి 50 శాతం తగ్గుదల కనిపిస్తోంది. సీడెడ్ లో పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. అక్కడ తొలి నుంచి వసూళ్లు అంతగా లేవు. ఇప్పుడు మరీ తగ్గాయట. ఒకే ఒక్క హిందీ పరిశ్రమలో మాత్రం సాహో వసూళ్లకు ఎదురే లేదు. ఇప్పటికే 110 కోట్ల మేర నెట్ వసూలు చేయడం అక్కడ పెద్ద ఊరట. అలాగే తమిళనాడులో కలెక్షన్లు అంత బాలేదు. కర్నాటక లో మాత్రం అద్బుత విజయం సాధించిందని రిపోర్ట్ అందింది. దాదాపు 300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టి ఆ మేరకు థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేశారు కాబట్టి అదంతా రికవరీ కావాల్సి ఉంటుంది.
తాగిందంతా దిగింది పైగా 100 బొక్క
కొన్ని ఏరియాల పంపిణీదారులు సేఫ్ అయినా చాలా ఏరియాల్లో పంపిణీదారులు భారీ మొత్తాల్ని పెట్టి రైట్స్ కొనుక్కున్న వారికి నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ సహా తమిళనాడులో వసూళ్లు ఆశాజనకంగా లేవని చెప్పుకుంటున్నారు. అయితే ఓవరాల్ గా వసూళ్లు దక్కుతున్నాయి కాబట్టి నష్టపోయిన పంపిణీదారులకు ఆ మొత్తాల్ని భర్తీ చేసేందుకు యు.వి.క్రియేషన్స్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం సాగుతోంది. తాగిందంతా దిగింది పైగా వంద బొక్క! అంటూ ఓ మాస్ ఆడియెన్ రివ్యూ చెబితే.. చాలా బావుంది అని చెబుతున్న అభిమానులు ఉన్నారు. ఈ తరహా మిశ్రమ స్పందనల నడుమ సాహో ఇంకా ఏ మేరకు వసూలు చేస్తుందో చూడాలి.