జనసేనానిని అవమానించడమే లక్ష్యమా?
`లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా తీసి తేదేపా అధినాయకుడు చంద్రబాబు నాయుడుని తీవ్ర అప్రతిష్ఠ పాల్జేసిన ఘనత ఆర్జీవీకే చెందుతుంది. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయ జీవితం దుంప నాశనం అవ్వడానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సినిమాలో చూపించారు ఆర్జీవీ. ఆయన అదరక బెదరక ఎంతో డేరింగ్ గా తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓ సెక్షన్ ఆడియెన్ ని మెప్పించింది. బాలకృష్ణ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ ని మించిన ఆదరణ పొందింది ఈ చిత్రం. ఇందులో చాలా వాస్తవాల్ని చూపించడంతో ఆర్జీవీకి ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు ఆర్జీవీ టార్గెట్ పవన్ కల్యాణ్. జనసేనానిగా పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యాన్ని వెండితెరపైకి తెస్తూ పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్లు అందరిలో వైరల్ అయ్యాయి. ఆర్జీవీలోని ఫన్ సెటైరికల్ యాంగిల్ కి నవ్వుకోని వాళ్లు లేరు. ఇక చంద్రబాబు.. ఎన్టీఆర్ లను తలపించే నటుల్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం వెతికిన ఆర్జీవీ పవర్ స్టార్ మూవీ కోసం పర్ఫెక్ట్ పవన్ కల్యాణ్ షాడోని దించేశారని తాజాగా లీకైన ట్రైలర్ చెబుతోంది.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ సెటైర్ పవన్ అభిమానులకు మంట పుట్టించడం ఖాయం. జనసేనాని ఓటమిని దెప్పి పొడుస్తూ పవన్ పై సెటైర్ వేశాడు ఆర్జీవీ. అతడి చుట్టూ ఉండే పాత్రల్ని అంతే ఫన్నీగా చూపించారు. నాదెండ్ల మనోహర్ .. చంద్రబాబు నాయుడు.. చిరంజీవి.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. బండ్ల గణేష్ .. కత్తి మహేష్.. వీళ్ల పాత్రలన్నిటినీ సెటైరికల్ పంచ్ లతో నింపేశాడు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్ ని అచ్చంగా దించేశాడు ఆర్జీవీ.
ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఎమోషన్ ని .. నాదెండ్ల ఎమోషన్ ని తెరపై చూపిస్తున్నాడు వర్మ. “ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పురా .. నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేదా నా తమ్ముడిగానా?“ అంటూ చిరు డైలాగ్ హైలైట్.. “సత్య ప్రమాణకంగా చెబుతున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను.. అంటూ చంద్రబాబు అంటుంటే .. మిమ్మల్ని నమ్మినందుకు… వెళ్లండి సామీ అంటూ పవన్ ఆవేదన చెందడం ప్రతిదీ ఫన్నీగా సెటైరికల్ గా చూపించారు. ఇందులో కత్తి మహేష్ పాత్ర పవన్ ని ఇంటర్వ్యూ చేస్తూ పంచ్ లు వేస్తుంది.
అయితే ఈ ట్రైలర్ ని చూడాలనుకుంటే రూ.25 చెల్లించి ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో చూడాల్సిందే. ఆయన నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయలేదు. ఇక సినిమాని ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఇదే థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. పవర్ స్టార్ మూవీకి కౌంటర్ గా ఆర్జీవీపై జనసైనికులు పరాన్న జీవి అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?time_continue=10&v=OgNvUfCeCjY&feature=emb_logo