సినిమా ఇండస్ట్రీని కరోనా వైరస్ ఏ రేంజ్ లో దెబ్బేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా థియేటర్స్ కొన్ని నెలల వరకు మూతపడటం తీవ్ర నష్టాలకు గురి చేసింది. అసలు ఈ రేంజ్ ల్ నష్టాలు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఇక కరోనా వైరస్ ను కూడా క్యాష్ చేసుకోవడానికే ప్రయత్నం చేసిన వర్మ ఆ మధ్య నగ్నం అంటూ కొన్ని వెబ్ సినిమాలతో బాగానే హడావుడి చేశాడు.
వాటివల్ల ఎంత లాభమా అందుకున్నాడో తెలియదు గాని ఇటీవల మొత్తానికి కరోనా వైరస్ ద్వారా బాక్సాఫీస్ ఖాతా అయితే తెరిచాడు. సినిమాను థియేటర్స్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఊహించని రిజల్ట్ ను అందుకుంది. ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు గాని వర్కౌట్ కాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల షేర్స్ మాత్రమే వచ్చయని తెలుస్తోంది. ఇక శని ఆదివారాల్లో థియేటర్స్ ఎక్కువగా ఖాళీగానే కనిపించాయి.
మొత్తానికి వర్మ ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న అపజయాలతో పోలిస్తే కరోనా కష్ట కాలంలో ఆయన అందుకున్న ఈ రిజల్ట్ పెద్దగా ఆశ్చర్యమేమి కలిగించలేదు. ఇక నెక్స్ట్ మర్డర్ సినిమాను కూడా థియేటర్స్ లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మిర్యాలగూడ పరువహత్య నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాపై అప్పట్లో వివధాలు బాగానే వచ్చాయి. కానీ ఇప్పుడు పెద్దగా బజ్ అయితే లేదు. కానీ వర్మ మాత్రం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నారు. మరి వాటి వల్ల ఏమైనా మ్యాజిక్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.