నీ బాడీలోని ప్రతీ పార్ట్ అద్భుతమే.. హీరోయిన్‌పై వర్మ కామెంట్

RGV Comments On Apsara Rani

ఆర్జీవీ అంటే అంతే మరి. ఏది అనిపిస్తే అదే అనేస్తాడు. మనుసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడే రకమే కాదు. ఏదైనా సరే అనిపిస్తే వెంటనే అడిగేస్తాడు.. అనేస్తాడు. ఏ మాత్రం మొహమాట పడడు. ఇంటర్వ్యూల్లోనూ లేడీ యాంకర్లను కూడా వదలడు. ఏదైనా అనిపిస్తే మొహం మీదే చెప్పేస్తున్నాడు. అందంగా ఉన్నావని, తొడలు బాగున్నాయని ఇలా ఓ కామెంట్ వేసేస్తాడు. తాజాగా వర్మ తన హీరోయిన్‌పైనా కామెంట్ చేశాడు.

RGV Comments On Apsara Rani

వర్మకు జర్వం వచ్చింది.. కరోనా లక్షణాలు ఉన్నాయని వార్తలు రావడంతో తనదైన శైలిలో స్పందించాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ నిక్షేపంగా ఉన్నానని తెలిపాడు. ఇక ఈ వీడియోలో ఆర్జీవీ కండలు చూసి అప్పర రాణి మోజు పడినట్టుంది. నేరుగా ట్విట్టర్‌లోకి దూకి ఆర్జీవీ కండలపై కామెంట్స్ చేసింది. సర్. మీరు చాలా స్ట్రాంగ్. నిజంగా కండలు చాలా చాలా బావున్నాయి. మీరు నిజంగా స్ఫూర్తినిచ్చే వారు అంటూ పొగిడేసింది.

RGV Comments On Apsara Rani

 

ఆడవారంటే ఎంతో ఇష్టమైన ఆర్జీవీ అప్సర లాంటి వారు కాంప్లిమెంట్ ఇస్తే రియాక్ట్ కాకుండా ఉంటారా? ఆమె ట్వీట్‌కు వెంటనే వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘చాలా కృతజ్ఞతలు కానీ నా కండలు బాగున్నాయని మర్చిపో. నీవు నీ శరీరంలోని ప్రతీ అంగుళాన్ని ఎంతో బాగా చూపించావ్.. నీ ప్రతీ పార్ట్ ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే నీ బట్టలు నీ అందాలను అంత అందంగా ఎలా కప్పి ఉంచుతున్నాయో ఇప్పటికే ఉహించలేకపోతున్నాను’ అని ఫ్టర్ట్ చేయడం ప్రారంభించాడు.ఇక వర్మ ఇంతలా పొడిగితే ఆ హీరోయిన్ ఊరుకుంటుందా?.. వెంటనే స్పందించింది. ‘హాహా.. ఇంత అద్భుతాన్ని (అమ్మాయిలు) సృష్టించినందుకు మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది..’ అని ట్వీట్ చేసింది. ఇలా వీరిద్దరి ముచ్చట్లు సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. ఇక బయటే ఇలా ఉంటే సినిమాలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. థ్రిల్లర్, డేంజరస్ చిత్రాలతో అప్పర రాణిని ఓ రేంజ్‌లో చూపించినట్టు తెలుస్తోంది.