తన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం 2.0 పై సెటైర్స్ వేసారు. తన శిష్యుడు సిద్ధార్థని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘భైరవ గీత’ అనే సినిమాను నిర్మించారు వర్మ. ఈ సినిమాను రజినీకాంత్ ‘2.0’ సినిమా రిలీజ్ రోజు విడుదల చేయాలని అనుకున్నారు. అఫ్ కోర్స్ తర్వాత సెన్సార్ ప్లాబ్లంస్ అంటూ రిలీజ్ డేట్ ఛేంజ్ చేసారు.
ఇక తన చిత్రం ప్రమోషన్ కోసం … 2.0 ని తమ సినిమా వాడుకుంటూ ఓ కొత్త స్ట్రాటజీ ని ప్లే చేసారు వర్మ. అదే నిజమైంది అంటున్నారు సోషల్ మీడియా జనం. ఇంతకీ వర్మ ఏమన్నాడో ఓ సారి గుర్తు చేసుకుందాం..
2.0 ని ఉద్దేశిస్తూ ”పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిన చిన్న పిల్లల సినిమా అది, చిన్న పిల్లాడు అయి సిద్ధార్థ తీసిన అడల్ట్ సినిమా మాది.. పిల్లల సినిమా చూస్తారా..? పెద్దల సినిమా చూస్తారా..? ఏది నచ్చుతుందో తేల్చుకోండి.. నిర్ణయం మీకే వదిలేస్తున్నాం” అన్నారు. ఇప్పుడు 2.0 రిలీజ్ అయ్యాక…ఈ సినిమా పిల్లల కోసం తీసిన సినిమా అని రివ్యూలన్నీ వచ్చాయి. దాంతో వర్మ జోశ్యం నిజమైంది అంటున్నారు.