షాకింగ్ : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన చరణ్ హీరోయిన్

టాలీవుడ్ గ్లోబల్ అండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన పలు చిత్రాల్లో అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన “ఎవడు” సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడు నుంచో అలా డిలే అవుతూ వచ్చిన ఈ చిత్రం విడుదల అయ్యి మంచి సక్సెస్ అయ్యింది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ ఇద్దరు ఉంటారు. కాగా వారిలో శృతి హాసన్ కాకుండా బ్రిటిష్ బ్యూటీ సహా ఇండియన్ సినిమాలు చేసిన నటి అమీ జాక్సన్ కూడా ఒకామె. కాగా ఈమె ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కాగా ఈ తర్వాత ఎన్నో భారీ చిత్రాల్లో నటించింది.

తమిళ్ నుంచి అయితే సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో సినిమాలు ఐ మరియు 2.0 అనే భారీ చిత్రాలు రెండు చేసింది. కాగా ఈ చిత్రాలు తర్వాత అయితే ఇక అమీ జాక్సన్ పెద్దగా కనిపించలేదు. అలా నెక్స్ట్ పర్సనల్ లైఫ్ లో బిజీ అయ్యిపోయిన తాను ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది.

మొదట ఎంతో అందంగా హాట్ గా కనిపించిన ఈ డాషింగ్ బ్యూటీ ఇప్పుడు చిక్కిపోయి అసలు గుర్తు పట్టని విధంగా చేంజ్ అయ్యిపోయింది. దీనితో ఈమె కొత్త లుక్ చూసి అంతా ఒక్కసారిగా షాకవుతున్నారు. నిజంగా ఈమె అమీ జాక్సానా అని ఆశ్చర్యపడుతున్నారు. అయితే అంత అందంగా ఉండే అమీ జాక్సన్ ఓపెన్ హైమర్ హీరోలా మారిపోతుంది అని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు ప్రస్తుతానికి ఆమె కొత్త లుక్ వైరల్ గా మారింది.
https://x.com/letscinema/status/1704733767339024492?s=20