విజయ నిర్మల మృతికి అసలు కారణం

ప్రముఖ నటి, దర్శకురాలు, కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే విజయ నిర్మల హఠాత్తు మరణానికి కారణం ఏమిటంటనేది ఆమె సన్నిహిత వర్గాల్లోనే కాక అభిమానుల్లోనూ అర్దం కాని విషయంగా మారింది. ఎందుకంటే .. ఆరోగ్యంగానే విజయ నిర్మల కనిపిస్తూ ఇటీవల కాలంలో విజయ నిర్మల చాలా మీటింగ్ లకు హాజరయ్యారు. చాలా ఉషారుగా, ఎప్పుడూ ముఖం మీద నవ్వు చెదరకుండా కనిపించారు.

సూపర్ స్టార్ కృష్ణకు అండగా, చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటి వ్యక్తి మరణించారంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఆరోగ్యంగా కనిపించే విజయ నిర్మలకు ఏమైందని ఆరా తీస్తున్నారు. అయితే విజయ నిర్మల ఆనారోగ్యానికి కారణం క్యాన్సర్. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. క్యాన్సర్ వ్యాధి ఉందని చెబితే ఆమెపై సానుభూతి కనబరిచేందుకు ఇష్టపడని కుటుంబం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

కొద్దికాలంగా సీక్రెట్‌గా చికిత్స క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ విజయ నిర్మల చాలా మనోధైర్యంతో ఉన్నారట. క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతున్నా ధైర్యాన్ని కోల్పోకుండా దానిని ఎదురించే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొద్దికాలంగా విజయ నిర్మల కాంటినెంటల్ హాస్పిటల్‌లో క్యాన్సర్ వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారు.

గత కొంతకాలంగా కాన్సర్ తో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.