గ్లామర్‌కు సై అంటున్న రష్మిక
చిత్రసీమ ఓ గ్లామర్ ఫీల్డ్. రంగులకల! ఇక్కడ నటిగా ఎన్నిరకాల పాత్రలు చేసినా గ్లామర్ విషయంలో మాత్రం ఒక అడుగు ముందుండక తప్పదు. అసలే కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఫ్లాట్‌ఫాం కనుక, ఇక్కడ పోటీని తట్టుకోవాలంటే గ్లామర్ విషయంలో హద్దులు గీసుకుంటే కుదరదు. కాదంటే, హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించాను అంటోంది శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక మండన. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక -తక్కువ టైంలోనే స్టార్ హీరో మహేష్ సరసన ఛాన్స్ అందుకుంది. ఛలో తరువాత రష్మిక చేసిన గీతగోవిందం సినిమా సంచలన విజయం సాధించడంతో రష్మిక రేంజ్ మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక, నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా రేంజ్ మారింది కనుక, గ్లామర్ విషయంలో బెట్టుచేసే పని పెట్టుకోనని చెప్పకనే చెబుతోంది. గ్లామర్ పాత్రలకు సిద్ధమేనన్న సిగ్నల్స్‌ను హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో పంపుతోంది. తాజాగా రష్మిక మండన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూస్తుంటే రష్మిక గ్లామర్‌కు సై అంటూ హింట్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. రష్మిక ఈ రేంజ్‌లో గ్లామర్‌కు రెడీ అయిందంటే మిగతా హీరోయిన్లకు గట్టి పోటీ తప్పదేమో.