దారుణంగా చంద్రబాబుని ఆడుకుంటున్న వర్మ

చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాని ఆంధ్రాలో రిలీజ్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం పార్టీకు చెందిన నేతలు కోర్టుకు వెళ్లి మరీ సినిమాను ఆపేసారు. ఆ రోజు చంద్రబాబుది గెలుపు. అయితే ఈ రోజు చంద్రబాబు కు ఓటమి ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణ ఓటమి పాలయ్యారు. దాంతో ఇప్పటికే కడుపుమండి ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో సెటైర్స్ సంధించారు.

వరుసగా సెటైరిక్‌ ట్వీట్లతో తెలుగుదేశం, చంద్రబాబుపై దండయాత్ర మొదలు పెట్టారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్‌ మీమ్‌తో మొదలు పెట్టారు వర్మ.

అలాగే ఆ తర్వాత టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకువస్తుందన్నారు.