జపాన్లో “RRR” రిలీజ్ పై లేటెస్ట్ వీడియో అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.!

ఈ ఏడాది పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ ట్రిపుల్ ఆర్(RRR) తో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా కోసం అనేక మంది ప్రముఖులు మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ పీరియాడిక్ యాక్షన్ వండర్ చిత్రం సుమారు 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి భారీ హిట్ గా నిలిచింది.

ఇంకా దీనితో పాటుగా అనేక దేశాల్లో ఇప్పటికీ స్పెషల్ స్క్రీనింగ్స్ ప్రదర్శితం చేయబడిన ఈ చిత్రం థియేట్రికల్ గా భారీ రిలీజ్ ని ఈ అక్టోబర్ లో అయితే జపాన్ దేశంలో జరుపుకోనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఆల్రెడీ రాజమౌళి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయగా..

ఇప్పుడు అయితే తమ జపాన్ మీడియా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ని పోస్ట్ చేసాడు. జపాన్ ఆడియెన్స్ ని పలకరిస్తూ తన బాహుబలి 1 అలాగే బాహుబలి 2 కి ఆల్రెడీ మంచి ఆదరణ అందించారని అలాగే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా RRR తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నానని.. 

వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ రోజు మీ అందరితో కలిసి మీ రియాక్షన్ ని చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నానని రాజమౌళి తెలిపారు. దీనితో ఇప్పుడు ఈ వీడియో మంచి వైరల్ గా మారింది.