పూరి – దేవ‌ర‌కొండ బిజినెస్ మొద‌లు

నేను మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి రాలేదు….ఈ ముంబైని ** పోయించడానికి వచ్చా.. ఇండియాలో డబ్బుంది.. ఎవడికి వాడు కావాల్సింది తీసుకోవడమే..!! ఇదీ పూరీ ఫిలాస‌ఫీ. ఫ‌క్తు బిజినెస్ మేన్ థియ‌రీ కూడా ఇదే. అయినా ముంబైకి పూరీకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. అందుకే ఈసారి కూడా ముంబైపైనే ప‌డ్డాడు. అయితే అతడు ముంబై వైపు ఓ చూపు చూడ‌డానికి చాలా చాలా కార‌ణాలు ఉన్నాయి. అంత‌కుమించి లాజిక్కులు జిమ్మిక్కులు ఏమిటో ఫ్యాన్స్ తెలుసుకుని తీరాలి.

విజయ్ దేవరకొండ ల్యాండ్ మార్క్ మూవీ (10 వ చిత్రం)కి పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫైట‌ర్ అనే పేరు ఇప్ప‌టికే పాపుల‌రైంది. ఈ సినిమాతోనే దేవ‌ర‌కొండ‌ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. . పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా ప్ర‌య‌త్నానికి తెర లేపాడు. బాలీవుడ్ చిత్రనిర్మాతలు కరణ్ జోహార్- అపూర్వా మెహతా లాంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి పూరి – చార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో క‌ర‌ణ్ రిలీజ్ చేస్తారు. తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం – హిందీ భాష‌ల్లో ఏకకాలంలో తెర‌కెక్కుతోంది. ఇక ఈ క్రేజీ చిత్రంలో వెట‌ర‌న్ స్టార్ రమ్య కృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సోమ‌వారం ముంబైలో లాంఛ‌నంగా వీడీ 10 ప్రారంభ‌మైంది.

చిత్రీకరణ నేటి నుంచి కొన‌సాగుతోంది. ఈ చిత్రంలో ఫైట‌ర్ గా బాక్స‌ర్ గా విజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. విజయ్ దేవరకొండ అందుకోసం ఫిజిక‌ల్ గా చాలా ప్రిపేర‌య్యాడు. థాయ్‌లాండ్ వెళ్లి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఏకంగా ప‌ది మంది కోచ్ ల వ‌ద్ద శిక్ష‌ణ పొందాడు. ప‌క్కాగా ప్రిపేరై ఇప్పుడు షూటింగుకి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాని ముంబైలో ప్రారంభించి అక్క‌డే తెర‌కెక్కించ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. అస‌లు కుద‌ర‌దు మొర్రో అంటున్న జాన్వీ క‌పూర్ ని క‌థానాయిక‌గా ఒప్పించేందుకే ముంబై లోక‌ల్ షూటింగ్ ని ప్లాన్ చేశార‌ని మరోవైపు ప్ర‌చారం వేడెక్కిస్తోంది. విజ‌య్- పూరి- దేవ‌ర‌కొండ బృందం ఓ వైపు షూటింగ్.. మ‌రోవైపు జాన్వీని ఒప్పించే ప‌నిలో బిజీగా ఉంటార‌ట‌.