ఇది చాలాకాలంగా జరుగుతున్న విషయమే. సంగీత దర్శకుడు తాను స్వరపరిచిన పాటలపై వచ్చే రాయితీ డబ్బును నిర్మాతలు , గాయని గాయకులకు ఇవ్వకుండా తనే తీసుకుంటున్నాడని ఆరోపణలు వచ్చాయి. చాలాకాలం క్రింద గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయంపై మండిపడ్డాడు .
ఇప్పుడు ఏకంగా 6 గురు సినిమా నిర్మాతలు ఇళయరాజా పై చెన్నై హై కోర్టులో కేసు పెట్టారు. ఇళయరాజా ను సంగీత దర్శకుడుగా పెట్టుకొని అతనికి సినిమాకి ఇంత అని చెల్లిస్తున్నాము. పాటలు రాసిన కవులకు మేమె డబ్బు చెల్లిస్తున్నాము. ఆయా పాటలను పాడే గాయని గాయకులకు కూడా మేమె డబ్బు ఇస్తున్నాము. ఇక పాటలను రికార్డు చేసే స్టూడియాలు , సాంకేతిక నిపుణులకు అందరికీ మేమె ఖర్చులు భరిస్తున్నాము . సినిమా విడుదలైన తరువాత వచ్చే రాయల్టీ మాకు రావాలి . అలా కాకుండా మ్యూజిక్ కంపెనీలు సంగీత దర్శకుడుపై మాత్రమే రాయల్టీ చెల్లించడం ఏమిటి అనేది వీరి అభియోగం .
సినిమా అనేది నిర్మాత ప్రాపర్టీ . అలాటప్పుడు ఆ సినిమాలోని సంగీతం సంగీత దర్శకుడుకు ఎందుకు చెందుతుంది ? అని వీరు అడుగుతున్నారు .మా కడుపులు కొట్టి ఇప్పటివరకు ఇళయరాజా రాయల్టీ ద్వారా 200 కోట్లు గడించాడని ఈ నిర్మాతలు చెబుతున్నారు. దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని నిర్మాత సెల్వకుమార్ చెప్పాడు .
అయితే మ్యూజిక్ కంపెనీ లో వాదన మరోలా వుంది . “1980 వరకు సంగీతం పై నిర్మాతలు సరైన అవగాహన ఉండేది కాదు . తమ పాటలను మ్యూజిక్ కంపెనీ కి డబ్బు తీసుకొని ఇచ్చేవారు . అలాటప్పుడు ఆయా నిర్మాతల పాటలకు రాయల్టీ మ్యూజిక్ కంపెనీ ఎందుకు చెల్లించాలి ? సంగీతం మాకు సంబంధించింది . కోర్టుకు వెడితే వెళ్లనివ్వండి . వారికి సంబందించిన డాక్యుమెంట్లను కోర్టులో చూపించాలి కదా ? “అన్నాడు .
మరి కోర్ట్ ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పునిస్తుందో ?