సన్నీలియోన్ కు  చెప్పుల దండ, షాక్

కొన్ని  సినిమాలు ఊహించని మలుపుతీసుకుంటాయి. వాటిని ప్రారంభ దశలో ఎవరూ ఊహించలేం. కానీ కొంత జరిగాక అసలు వివాదాలు మొదలవుతాయి. అప్పుడు వెనక్కి వెళ్లాలా..ముందుకు వెళ్లాలా తెలియని పరిస్దితి నెలకొంటుంది. ఇప్పుడదే పరిస్దితి సన్నిలియోన్ తాజా చిత్రం విషయంలో మొదలైంది.

 సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ టైమ్ లో వివాదం రాజుకోవటం అందరనీ ఆశ్చర్యచకుతలని చేస్తోంది. అదేదో సినిమా ప్రారంభం ఎనౌన్సమెంట్ రోజే చెప్పి  ఉంటే ఈ స్దితి వచ్చేది కాదు అంటున్నారు. అసలేం జరిగింది..ఏం సినిమా అది..గొడవేంటి అనే కదా మీరు అడగాలనుకుంటుంది. అయితే ఈ క్రింద చదివేయండి.

 మాజీ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ నటిస్తోన్న చిత్రం ‘వీర మహాదేవి’. ఐదు భాషల్లో రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందని చెప్పబడుతోన్న ఈ చిత్రం స్టివ్స్‌ కార్నర్‌ పతాకంపై ఫోన్స్‌ స్టీఫెన్‌ నిర్మాతగా వి.సి.వడివుడయాన్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. నాజర్‌తో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు.    తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అంతవరకూ బాగానే ఉంది. అయితే  ‘వీరమహాదేవి’పాత్ర కోసం సన్నీలియోన్ ని తీసుకోవడం పట్ల కర్ణాటక ‘రక్షణ వేదిక’ ఆందోళన బాట పట్టింది. ఆమె మహారాణి వీరమహాదేవిగా కనిపిస్తే తమ సంస్కృతిని దెబ్బతీసినట్లే అని ఆందోళనకారులుడైరక్ట్ గా చెప్తున్నారు. రోడ్డెక్కి నిరశనలు ప్రకటిస్తన్నారు.

నిరసనలో భాంగంగా సన్నీని అవమానిస్తూ ఆమె పోస్టర్లకు చెప్పుల దండలు వేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో కర్ణాటకకు చెందిన యువసేన కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా సెప్టెంబరులో ఆందోళన చేసింది.

 ‘లార్డ్‌ఆఫ్‌ది రింగ్స్‌’, ‘గాడ్స్‌ ఆఫ్‌ ది ఈజిప్ట్‌’ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్సే పనిచేయడం విశేషం. ఇందుకోసం రూ.40 కోట్లు ఖర్చుపెడుతున్నామని నిర్మాతలు తెలియజేశారు.