సైన్స్ ఫిక్షన్ తర్వాత రామాయణ కథతో ప్రభాస్ ప్రయోగం
డార్లింగ్ ప్రభాస్ ఒకదాని వెంట ఒకటిగా సినిమాల్ని ప్రకటిస్తూ ఊహించని షాక్ లిస్తున్నారు. నిన్నగాక మొన్న ప్రభాస్ 21 భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతుందని ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనిదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దీపిక పదుకొనేని ప్రధాన కథానాయికగా నివేధ థామస్ ని రెండో నాయికగా ఎంపిక చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో బాహుబలి .. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాల్ని మించిన విజువల్ ఫీస్ట్ ని తెరకెక్కిస్తామని దత్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు .. ఈ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతాడని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిచింది.
ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఇంకో షాక్ ఇచ్చాడు డార్లింగ్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ – టీ.సిరీస్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రాన్ని ప్రకటించి షాకిచ్చాడు. ఈ సినిమా టైటిల్ `A-ఆదిపురుష్`. ఆదిపురుషుడు అంటే ఇది శ్రీరాముని కథతో తెరకెక్కనుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా స్క్రిప్టుని సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుంది. దాదాపు 600-800 కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చించి 3డి లో విజువల్ గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కిస్తారని సమాచారం.
తెలుగు హిందీ ద్విభాషా చిత్రమిది. ఆ రెండు భాషలు సహా అంతర్జాతీయ విడుదల కోసం అనేక విదేశీ భాషలలోకి అనువదిస్తారు. దాంతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలోనూ రిలీజవుతుంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తే .. ఇందులో రావణాసురుడిగా ఎవరు నటిస్తారు? అన్నది ఆసక్తికరం. ఇక సీత పాత్ర.. లక్ష్మణుడు.. ఆంజనేయుడు .. వాలి.. సుగ్రీవుల పాత్రలు రక్తి కట్టిస్తాయని భావిస్తున్నారు. ప్రధాన విరోధి పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ తారల్ని పరిశీలిస్తున్నారు.
ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థ సహకారంతో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారం కోసం `తెలుగు రాజ్యం`ను అనుసరించండి.