మొదటి రోజే అత్యధిక వసూలు సాధించిన సినిమాలు.. అక్కడ కూడా ప్రభాస్ దే పై చెయ్యి!

రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయిందీ, ప్లాప్ అయింది మొదటి రోజు కలెక్షన్స్ తోనే తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోజు సినిమా కలెక్షన్స్ మీద దృష్టి పెడతారు. వాటిని అంచనా వేసుకునే సినిమా ఎన్ని కోట్లు సాధిస్తుంది అనే ఒక అంచనాకి కూడా వస్తారు సినీ క్రిటిక్స్. అలాగే అభిమానులు తమ స్టార్ రికార్డు క్రియేట్ చేస్తే చూడాలని ఆశ పడుతుంటారు.

ప్రస్తుతం పుష్ప డిసెంబర్ 5న విడుదలై మొట్టమొదటి రోజే 294 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల రికార్డులన్నీ తిరగరాసింది ఈ పుష్ప 2. ఈ సందర్భంగా ఫస్ట్ డే అత్యధిక కలక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 తర్వాత స్థానం ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటిరోజు 223 కోట్లు వసూలు చేసింది.

ఇక మూడో ప్లేస్ లో కూడా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 ఉంది. ఈ సినిమా మొదటి రోజు 210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. నాలుగో ప్లేస్ లో కూడా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజే 191 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సాలార్ 178 కోట్లు కలెక్ట్ చేసి ఐదో ప్లేస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా లో కూడా ప్రభాస్ హీరో కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన దేవర సినిమా మొదటి రోజే 172 కోట్ల కలెక్షన్స్ సాధించి ఆరవ స్థానం దక్కించుకుంది.

తర్వాత 160 కోట్ల కలెక్షన్స్ తో యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ సినిమా ఏడవ స్థానం దక్కించుకుంది. ఇక ఎనిమిదవ స్థానంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ఉంది ఈ సినిమా 148 కోట్లు వసూలు చేసింది. ఇక 140 కోట్లు వసూలు చేసిన ఆది పురుష్ తొమ్మిదవ స్థానంలోనూ 130 కోట్లు కలెక్ట్ చేసిన సాహో 10వ స్థానంలోనూ ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ సినిమాలు ప్రభాస్ వి కావటం విశేషం.