పఠాన్, RRR, KGF 2, బాహుబలి 2.. ఫుట్ ఫాల్స్ ఎంత?

రీసెంట్ గా రిలీజైన షారుఖ్ పఠాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. వందల కోట్లను కొల్లగొట్టింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి దీంతో ప్రతిరోజు థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్లే సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఈ సినిమా అత్యధికంగా వీక్షించిన జాబితాలోనూ చోటు దక్కించుకుంది. మరి ఈ చిత్రానికి ఎంత మంది చూశారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు సంపాదించింది? బడ్జెట్ ఎంత? తెలుసా? వీటితో పాటు అత్యధికంగా సినిమా వీక్షించిన జాబితాలో ఇంకేం చిత్రాలు ఉన్నాయి? వాటి కలెక్షన్స్, బడ్జెట్ ఎంతో తెలుసా? ఆ సంగతులే ఈ కథనం.

దాదాపు ఐదేళ్ల తర్వాత వెండి తెరపై పఠాన్ సినిమాతో సందడి చేశారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. రూ.250 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.970 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాను భారత్ లో 3 కోట్ల మంది వీక్షించారు.

తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన చిత్రం బాహుబలి. ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రికార్డులు సృష్టించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే రెండో భాగాన్ని భారత్ లో 10.82 కోట్ల మంది చూశారంటా. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1235 కోట్లు వసూలు చేసింది.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. గతేడాది ఏప్రిల్‌ 14న విడుదలై వరల్డ్ వైడ్ గా రూ. 1235 కోట్లకు పైగా వసూలు సాధించింది. యశ్‌ స్టైల్‌, నటన, ప్రశాంత్‌ టేకింగ్‌ సినీ ప్రముఖులనూ ఫిదా చేశాయి. రవి బస్రూర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఈ మూవీని 5.30 కోట్ల మంది ఇండియన్ ఆడియన్స్ వీక్షించారని తెలిసింది.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ సంచలనాను సృష్టిస్తూ అంతర్జాతీయ వేదికపై రికార్డులు సృష్టిస్తుంది. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంతోంది. అయితే ఈ మూవీని 4.43 కోట్ల మంది భారత ప్రేక్షకులు చూశారని సమాచారం. రూ.400కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.