ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ సినిమా కోసం తమ్ముడు పవర్ స్టార్ రాబోతున్నాడా.?

Pawan Kalyan talks about Prajarajyam and Chiranjeevi

తెలుగు సినిమా దగ్గర భారీ ఆదరణ ఉన్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ హీరోస్ మెగా కుటుంబం నుంచే ఉన్నారని చెప్పాలి. ఇతర అంశాల్లో ఏమో కానీ సినిమాల పరంగా అయితే మెగా హీరోలకి ఫ్యాన్స్ ఎలాంటి లోటు చెయ్యరు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఒకో హీరో ఒకో భారీ సినిమాతో సిద్ధంగా ఉండగా వారిలో మెగాస్టార్ చిరు కూడా పలు సినిమాలు చేస్తున్నారు.

ఇక వాటిలో దర్శకుడు మెహన్ రాజా తో చేస్తున్న రీమేక్ కం భారీ మల్టీ స్టారర్ సినిమా “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. దీనిపై అనేక అంచనాలు ఇప్పుడు నెలకొనగా తాజాగా సినీ వర్గాల నుంచి ఓ టాక్ సెన్సేషన్ గా మారింది. ఈ దసరా కానుకగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని ఇప్పుడు గట్టి టాక్ మొదలయ్యింది.

అయితే ఇది మెగా కాంపౌండ్ నుంచి కూడా వినిపిస్తున్న మాట. అంటే ఆల్ మోస్ట్ ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ హాజరు కావడం కన్ఫర్మ్ అనే చెప్పి తీరాలి. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన ఒకటి వస్తే అభిమానులకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు.