“వీరమల్లు” విషయంలో పవన్ సీరియస్..కానీ అసలు పని ఎప్పుడు.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల పట్ల అంత సీరియస్ గా అయితే లేరని ఇది వరకే చెప్పుకున్నాం. కానీ పవన్ అయితే ఇప్పుడు తన లుక్ మార్చినా మళ్ళీ తన సినిమాల విషయంలో ముఖ్యంగా తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉన్నట్టు ఇప్పుడు బయటకి వచ్చింది.

తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో అయితే తాను అలాగే పవన్ కళ్యాణ్ లు కలిసి హరిహర వీరమల్లు వర్క్ షాప్ లో బిజీగా ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ పోస్ట్ చూసాక పవన్ ఫ్యాన్స్ కి మరియు సినీ ప్రముఖులకు షాక్ వచ్చినట్టు అయ్యింది.

ఎందుకంటే తన సినిమాల విషయంలో చాలా వరకు అంత శ్రద్ధ చూపించని పవన్ కళ్యాణ్ ఈ సినిమా లోసం మాత్రం ఏకంగా వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నాడట. దీనితో పవన్ ఈ సినిమా విషయంలో తీసుకున్న డెసిషన్ ఆసక్తిగా మారింది.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సినిమా షూటింగ్ లో అయితే పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి పవన్ అయితే ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడా అని కొందరు పెదవి విరుస్తున్నారు.