బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారంలానే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా శుక్రవారం ఎపిసోడ్ లో నూతన్ నాయుడికి ప్రమాదం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ కి కంటెస్టెంట్స్ కౌశల్, రోల్ రైడా పోటీ పడ్డారు. బిగ్ బాస్ వారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే క్యూబ్స్ తో పిరమిడ్ నిర్మించాలి.
ఎక్కువ క్యూబ్స్ తో ఎవరైతే పిరమిడ్ నిర్మిస్తారో వారే విజేతలు. చాలా సింపుల్ అనుకుంటున్నారా? అంత సింపుల్ గా బిగ్ బాస్ టాస్క్ ఎందుకు ఉంటుంది. ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఒక పోటీదారుడికి మద్దతు ఇచ్చేవాళ్ళు మరొక పోటీదారుడు పిరమిడ్ ని బాల్స్ తో కొడుతూ అది పడిపోయేలా చేస్తుండాలి. ఎవరైతే చివరి వరకు ఎక్కువ క్యూబ్స్ తో పిరమిడ్ కాపాడుకుంటారో వారే విజేతలు.
అయితే ఈ టాస్క్ లో నూతన్ నాయుడు కౌశల్ కి సపోర్ట్ చేస్తూ రోల్ రైడా పిరమిడ్ ని పడేయడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగా బాల్స్ విసురుతున్న నూతన్ ఒక్కసారిగా తీవ్రమైన భుజం నొప్పితో పడిపోయాడు. తోటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ని వైద్య సహాయం కోరి అతన్ని కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లారు. డాక్టర్ వచ్చి పరీక్షించి అతనికి “క్రిటికల్ షోల్డర్ డిస్ లొకేషన్” అయిందని నిర్ధారించారు.
ఈ సందర్భంలో అతను హౌస్ లో ఉండటం మంచిది కాదని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని తేల్చారు. వైద్య బృందం అతడిని స్ట్రెచర్ పైన హౌస్ నుండి బయటకి తరలించారు. మిగిలిన హౌస్ మెంబర్స్ కి ఈ విషయాన్ని తెలిపాడు బిగ్ బాస్. నూతన్ బ్యాగ్ సర్ది బయటకి పంపాల్సిందిగా సూచించాడు బిగ్ బాస్. తనకి సపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగిన కారణంగా తనవల్లే అతనికి ప్రమాదం జరిగిందనే గిల్టీ ఫీలింగ్ తో బాధ పడుతున్నాడు కౌశల్. హౌస్ మెంబర్స్ అందరు నూతన్ ని తలుచుకుని బాధ పడుతున్నారు.