కౌశ‌ల్ జోస్యం.. ఫైన‌ల్ ఫైట్‌లో ఆ ఐదుగురు!

నార్త్ నుండి పాకిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రాంతీయ భాష‌ల‌లోను మంచి రేటింగ్‌తో దూసుకెళుతుంది. తెలుగులో మొద‌టి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌నుండ‌గా, రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. మూడు, నాలుగు సీజ‌న్‌ల‌కు నాగార్జున‌నే హోస్ట్ చేస్తున్నాడు. 15 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో ముగ్గురు స‌భ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఏడుగురు స‌భ్యులు ఇంటి నుండి ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం 11 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో టాప్ 5 ఎవ‌రు ఉంటార‌నే దానిపై అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కు విజేత‌గా నిలిచిన కౌశ‌ల్ మండా సీజ‌న్ 4కు సంబంధించిన హౌజ్‌మేట్స్ ని ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. నాలుగో సీజన్ కంటే రెండో సీజనే బెటర్ అని చెప్పుకొచ్చారు. ఈసారి అన్నీ కూడా పాత టాస్కులే పెడుతున్నారని.. కాస్త కొత్త టాస్కులు పెట్టాలని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేశారు. గ‌తంలో మాదిరిగా కొన్ని ల‌వ్ ట్రాక్స్ ఈ సీజ‌న్‌లోను న‌డిపించాల‌ని ప్లాన్ చేశారు కాని అది వ‌ర్క‌వుట్ కాలేదు. అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీ దానికి నిదర్శనమని అన్నారు.

నాలుగో సీజ‌న్‌లో టాప్ 5 ఎవ‌రు ఉంటార‌నే దానిపై కూడా కౌశ‌ల్ మాట్లాడుతూ.. అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ ఉంటారని కౌశల్ జోస్యం చెప్పారు. వీటిలో పెద్ద‌గా మార్పులు ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ సీజ‌న్‌లో కూడా మ‌హిళా విజేత‌లు ఉండ‌క‌పోవ‌చ్చు అని అభిప్రాయ‌ప‌డ్డారు కౌశ‌ల్. కాగా, బిగ్ బాస్ సీజ‌న్ 4 ఎలిమినేష‌న్ విష‌యంలో ఎన్నో వివాదాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.కుమార్ సాయి, దివి, దేవి నాగవల్లి,స్వాతి దీక్షిత్ విష‌యంలో అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల ఓటింగ్స్ ఆధారంగా కాకుండా నిర్వాహ‌కుల ఇష్టం ప్ర‌కార‌మే ఎలిమినేష‌న్ చేస్తున్నార‌ని అంటున్నారు.