ఇక్కడ రోల్ రైడా అక్కడ అరియానా.. బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో కంటెస్టెంట్స్

Bigg Boss Fame Ariyana and Roll Rida Birthday celebration

బిగ్ బాస్ కంటెస్టెంట్ల బర్త్ డేలంటే ఆ రోజు సోషల్ మీడియాలో సందడి వాతావరణం ఉండాల్సిందే. మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కలుసుకోకపోయినా తమ తమ ఫ్రెండ్స్ మాత్రంవస్తుంటారు. బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువగా క్లోజ్ ఉన్నవాళ్లంతా వస్తుంటారు. అందులోనూ కొందరికీ వీలు పడకపోవచ్చు కూడా. అయితే ఏది ఏమైనా బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఒకే చోటకు చేరుకుంటారు. అలా నిన్న బిగ్ బాస్ రెండు, నాలుగు సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్ల బర్త్ డేలు గ్రాండ్‌గా జరిగాయి.

Bigg Boss Fame Ariyana and Roll Rida Birthday celebration
Bigg Boss Fame Ariyana and Roll Rida Birthday celebration

బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్, ర్యాపర్ రోల్ రైడా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలో అమిత్, భాను, సామ్రాట్, గణేష్, తనీష్, నందినీ రాయ్ వంటి వారంతా పాల్గొన్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ రోల్ రైడా ఎక్కువగా వీరితోనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా అమిత్, భాను శ్రీలతోనే ఎక్కువగా క్లోజ్. మొత్తానికి ఇలా రోల్ బర్త్ డే సందర్బంగా మళ్లీ చిన్న పాటి రీ యూనియన్ వంటివి జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ అరియానా బర్త్ డే వేడుకలు బాగానే గ్రాండ్‌గా జరిగాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో తన ఫ్రెండ్స్ కొందరినీ ఇంటికి పిలిచి లంచ్ పార్టీ ఇచ్చింది. ఇందులో మోనాల్, సోహెల్, మెహబూబ్, లాస్య వంటి వారున్నారు. ఈ మేరకు లంచ్ పార్టీని ఇంట్లోనే గ్రాండ్‌గా చేసుకున్నట్టున్నారు. అందులో భాగంగా సోహెల్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడట. అరియానాకు వాచ్‌లంటే ఇష్టమని ఓ స్పెషల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడట. మెహబూబ్ ఏకంగా వాచ్ షాప్‌కే తీసుకెళ్లి ఇష్టమైంది తీసుకో అని ఆఫర్ ఇచ్చాడట. అలా మొత్తంగా అరియానా బర్త్ డే కూడా గ్రాండ్‌గా జరిగింది.