బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. గీతా మాధురి, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, తేజస్వీ వంటి వారు ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ప్రస్తుతమైతే బిగ్ బాస్ రీ యూనియన్ అంటూ కంటెస్టెంట్లందరూ సందడి చేస్తున్నారు. తాజాగా రోల్ రైడా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఆ క్రమంలో కొందరు తనీష్ గురించి చెప్పమని అడిగారు. దీంతో రోల్ రైడా చెప్పిన సమాధానానికి తనీష్ మురిసిపోయాడు.
మామూలుగా బిగ్ బాస్ ఇంట్లో తనీష్ రోల్ రైడా మరీ అంత క్లోజ్ అయితే కాదు. బిగ్ బాస్ ఇంట్లో అమిత్, రోల్, భాను శ్రీ ఒక్క గ్యాంగ్. తనీష్ సామ్రాట్ తేజస్వీ, దీప్తి మరో గ్యాంగ్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. ఎలిమినేషన్‌లు అవుతున్నా కొద్దీ అందరూ దగ్గరయ్యారు. అలా రోల్ రైడా, తనీష్, సామ్రాట్ అందరూ బాగానే ఉండేవారు. అయితే అందరూ ఒక వైపు కౌశల్ ఒక్కడు ఒక వైపు ఉండేవాడు. కౌశల్ అలా ఉండేందుకు ఇష్టపడ్డాడు కూడా.
రోల్ రైడా తాజాగా తనీష్ గురించి చెప్పుకొచ్చాడు. అభిమానులు అడగడంతో తన మనసులోని మాట చెప్పాడు. ఏది చెప్పినా సూటిగా చెప్పే మనస్తత్వం.. ఎప్పటికీ నా గలీజ్ ఫ్రెండ్ అంటూ సెటైర్ వేశాడు. దీంతో తనీష్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కూడా ఓ ఈవెంట్‌లో సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ ఉత్సవం పేరితో రాబోతోన్న ఈవెంట్‌లో నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొనబోతోన్నారు.