టాలీవుడ్‌లో చ‌క్రం తిప్పుతున్న నైజాం డాన్

టాలీవుడ్ పెద్ద‌న్న‌ల జాబితాలో ఆయ‌న పేరు ఉన్నా ఎందుక‌నో బ‌య‌ట ప్ర‌పంచంలో మార్మోగేది త‌క్కువే. కానీ ప్ర‌త్యేక‌ తెలంగాణ ఏర్పాటు ఆయ్యాక ఆయ‌న పేరు మార్మోగుతోంది. కేసీఆర్ – కేటీఆర్ వంటి నాయ‌కుల అండ‌తో ఆయ‌న హ‌వా ఆ రేంజులోనే మొద‌లైంది. ఇప్పుడు ఇంతింతై అన్న చందంగా ఎదిగేందుకు ఆయ‌న ప్లానింగ్స్ సాగుతున్నాయి. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే… ఏషియ‌న్ నారంగ్ దాస్. 19 మంది నిర్మాతల‌తో టాలీవుడ్ ని శాసిస్తున్న నిర్మాత‌ల గిల్డ్ లో ఆయ‌న ఒక డీన్.

ఏషియన్ సినిమాస్ సంస్థను ప్రారంభించి చిత్ర పంపిణీ రంగంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు నారాయణదాస్ నారంగ్. సోమవారం (జూలై 27) నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ అభివృద్ధిలో ఆయన చేస్తున్న కాంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటే… నారాయణదాస్ నారంగ్ ఇప్పటిదాకా దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశారు. అందులో చిత్ర పరిశ్రమ గర్వించే బాహుబలి లాంటి చిత్రాలు ఉండటం విశేషం. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా గత ఏడాది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నారాయణదాస్ నారంగ్.

పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “చిత్ర పరిశ్రమ నాకు తల్లి లాంటిది. 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టంది. వాటిని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆ ప్రేమే నన్ను చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల్లో అడుగుపెట్టేలా చేస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ నిర్మాణంతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ కల్గించాము. ఏఎంబీ హైదరాబాద్ మొత్తంలో ది బెస్ట్ లగ్జరీ మల్టీఫ్లెక్స్.అంతే గాకుండా ఇప్పుడు మేము నిర్మాణ రంగం లోకి ఎంటర్ అయ్యాం. ఏమిగోస్  క్రియేషన్స్, పి రామ్మోహన్ రావుతో కలిసి “లవ్ స్టోరీ” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది.ఇంకా 15 రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తాం.మాకు శేఖర్ కమ్ముల పనితనం బాగా నచ్చింది.అందుకే మా తర్వాతి సినిమా కూడా ఆయన తోనే చేయబోతున్నాం.ఒక పెద్ద హీరో తో ఆ మూవీ ఉంటుంది.దానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాం“ అని అన్నారు.

ఇక నిర్మాత‌ల గిల్డ్ లోని 19 మంది ఇటీవ‌ల టాలీవుడ్ లో చ‌క్రం తిప్పుతున్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ‌వ్వాలి?  థియేట‌ర్లు వేటికి కేటాయించాలి? వ‌గైరా వ‌గైరా వ్య‌వ‌హారాలు చక్క‌దిద్దుతున్నారు. ఈ వ్య‌వ‌హారాల్లో నారంగ్ ప్రాముఖ్య‌త పెరిగింది. మ‌హేష్ తో క‌లిసి ఏఎంబీ సినిమాస్ ని ప్రారంభించారు. దీనిని ప‌లు మెట్రోల‌కు విస్త‌రించ‌నున్నారు. అలాగే నారంగ్ భాగ‌స్వాముల‌తో క‌లిసి వ‌రుస‌గా సినిమాల్ని నిర్మిస్తున్నారు.