ఒక్క లైట్ బాయ్ నా గురించి అలా చెప్పినా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా: విశ్వక్ సేన్

“వెళ్ళిపోమాకే” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామాదాస్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాల ద్వారా హిట్ అందుకున్న విశ్వక్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. విశ్వక్ నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా దర్శకుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల విశ్వక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ హీరో అర్జున్ సర్జ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో విశ్వక్ నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటన విడుదల అయింది.

అయితే తాజాగా విశ్వక్ ఈ సినిమాలో నటించననీ చెప్పటంతో అర్జున్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో విశ్వక్ సేన్ మీద ఫిర్యాదు చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అర్జున్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విశ్వక్ సేన్ ఒక అన్ ప్రొఫెషనల్ నటుడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పటివరకు ఈ వివాదంపై స్పందించని విశ్వక్ సేన్ తాజాగా అర్జున్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమానికి విశ్వక్ అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో విశ్వక్ ఈ వివాదంపై స్పందించాడు.

ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…’నటుణ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అవమానాలు ఎదుర్కొన్నా. హీరోగా పాపులర్ అయినా కూడా నేను ఆ మాటలు మర్చిపోను. ఎందుకంటే మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని. నేను చాలా ప్రేమతో సినిమాలు చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుని..పూర్తయిన తర్వాత ప్రచారాన్ని భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ నటుడు ఉండడు. అర్జున్ సర్ సినిమాలో కొన్ని మార్పులు చేయమని చెప్పాను. కానీ కళ్ళు మూసుకొని కాపురం చెయ్యి అన్నట్లు ఉండటంతో సినిమా షూటింగ్ కి వెళ్ళటానికి భయమేసింది. నేను కావాలనే ఈ సినిమా నుండి తప్పుకొలేదు. నేను కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ నటుడు కాదని ఒక్క లైట్ బాయ్ చెప్పినా సరే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.