సందర్భం ఒకటే. కానీ ఓ ఇద్దరు స్పందించిన తీరే డిఫరెంట్. ఒకరు బాలయ్య ది బెస్ట్ .. నా మొదటి హీరో! అని పొగిడేస్తే .. ఇంకొకరు మాత్రం.. ఆయన గానం వింటే ఇక అంతే!! అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఆ ఇద్దరు ఎవరు? అంటే.. ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇంకొకరు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ.
నేడు నందమూరి బాలకృష్ణ 60వ బర్త్ డే సందర్భంగా తారక్ ఏమని ట్వీట్ చేశారంటే.. నా చిన్నతనంలో నేను స్ఫూర్తి పొందిన తొలి హీరో మీరు! అంటూ ఎంతో వినమ్రతను చాటుకున్నారు. ఇంకా ఏం అన్నారో ఈ ట్వీట్ చదవాల్సిందే..
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK pic.twitter.com/C2zDH9iO44
— Jr NTR (@tarak9999) June 10, 2020
ఆర్జీవీ మాత్రం బాలయ్య పాడిన శివశంకరి .. పాటకు విజువల్స్ వేసి మరీ పంచ్ లు విసిరారు. మహమ్మద్ రఫీ.. ఎస్పీబీ బాలయ్య ముందు జూనియర్ ఆర్టిస్టులు అంటూ సెటైర్ వేశారు. బాలయ్య పాటను విజువల్ గా చూపించారు ఈ ట్వీట్ లో.. ఆర్జీవీ స్పందన ఎలా ఉన్నా కానీ.. అలాంటి సంక్లిష్టమైన క్లాసిక్ గీతాన్ని ఆలపించే సాహసం బాలయ్య తప్ప ఇంకెవరైనా చేయగలరా? అన్నది అభిమానుల మాట.
WOW Mohammed Rafi and SPB are like junior artistes in singing ..The pulsing beat in his soothing emotional chords will rise the heart beat of listeners .its Othello’s Ballad mixed with Shankara Shastry and Mozart providing the musical landscape https://t.co/eP4F2JJL0M
— Ram Gopal Varma (@RGVzoomin) June 9, 2020