ఈ మధ్య టాలీవుడ్ పరిశ్రమ ఏటో దూసుకుపోతోంది. ఉత్తరాది సైతం కధల కోసం మన వైపే చూసేంతగా మారిపోయింది. ఇక హీరోలైతే ఒకరిని మించి మరొకరు కానీ వినీ ఎరుగని ప్రతిభ చాటుతూ ముందుకు పోతున్నారు. తాజాగా 2 లేదా 3 అంత కంటే ఎక్కువ నిడివి గల డైలాగులు కానీ పాటలు కానీ సింగల్ షాట్ లో తీయడం ఒక కొత్త క్రేజ్ ను తెచ్చుకుంది.
తాజాగా సంపూర్ణేష్ బాబు తన ‘కొబ్బరి మట్ట’ సినిమా కోసం 3 . 2 7 నిముషాల డైలాగు ఒకే షాట్ లో చెప్పి ఆశ్చర్య చకితులను చేశారు. అలాగే విజయ్ దేవరకొండ కాంటీన్ పాట. ఇప్పుడు ఇలాంటి ఫీట్ నే హీరో నాగ శౌర్య చేయనున్నారు. తన కొత్త సినిమాలో 3 ని డైలాగ్ ను సింగల్ షాట్ లో చేసి ఆశ్చర్య పరచనున్నారు.
ఈ సినిమాతో రమణ తేజ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ లోనే శౌర్య యాక్షన్ సీన్ చేస్తుండగా గాయపడ్డారు. కానీ అప్పుడే కోలుకుని షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు