‘అర్జున్ రెడ్డి’ డైరక్టర్ విడుదల చేసిన కామెడీ ట్రైలర్

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ ఇక్కడ‌.. అంటూ త‌న‌దైన కామెడీ, టైమింగ్‌తో నవ్వించే స్టార్ క‌మెడియ‌న్ పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మై డియ‌ర్ మార్తాండం’. మేజిన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌య్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రీష్‌ కె.వి. ద‌ర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి.

డిసెంబ‌ర్ 29న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. పూర్తి కామెడీ తో రూపొందిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది. 30 రోజుల్లో లాయర్ అయ్యి కోర్టులో కేసులను ఎలా గెలిపించాడనే కథ తో తెరకెక్కింది ఈ చిత్రం.

My Dear Marthandam Movie Theatrical Trailer | Prudhvi Raj | Harish K V | #MyDearMarthandamTrailer

ఈ సంద‌ర్భంగా.. నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ.. ‘‘క‌మెడియ‌న్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీగారు టైటిల్ పాత్రలో న‌టిస్తున్నారు. ‘ముప్పై రోజుల్లో లాయ‌ర్ అవ‌డం ఎలా”? అనే పుస్తకాన్ని చ‌దివిన డిఫెన్స్ లాయ‌ర్ పాత్రలో పృథ్వీగారి న‌ట‌న సినిమాకే హైలైట్ కానుంది. ’’ అన్నారు.

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పృథి తన కామెడీ తో అక్కట్టుకుంటాడు. ఈ చిత్రంలో
పృథ్వీ, జ‌య‌ప్రకాశ్ రెడ్డి, కృష్ణ భ‌గ‌వాన్‌, రాకేందు మౌళి, గోకుల్‌, క‌ల్పిక గ‌ణేశ్‌, క‌ల్యాణ్ విట్టపు, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో నటించారు. ముఖ్య పాత్రల్లో నటించారు. పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మజిన్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.