Sandeep Reddy: సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ… తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే నాకు తెలిసిన ఒక మలయాల కో ఆర్డినేటర్ ద్వారా సాయి పల్లవి గురించి ఎంక్వయిరీ చేశాను. ఈ సినిమా కథ తనకు వివరించాలని చెప్పాను అలాగే ఈ సినిమా కాస్త రొమాంటిక్ మూవీ అని చెప్పాను.
ఇలా ఈ సినిమా రొమాంటిక్ చిత్రం అని చెప్పడంతో ఆ కోఆర్డినేటర్ మీరు ఈ సినిమాలో సాయి పల్లవి నటించాలనే కోరికను మానుకోండి అంటూ తెలిపారు. ఆమె కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోరు అలాంటిది రొమాంటిక్ సినిమాలలో నటించరని తెలిపారు. అలా ఈ సినిమాలో సాయి పల్లవి గురించి ఎంక్వయిరీ చేసే వద్దనుకున్నానని సందీప్ రెడ్డి తెలిపారు.
ఇకపోతే చాలామంది హీరోయిన్స్ కెరియర్ మొదట్లో ఇలాంటి కొన్ని నియమాలు పెట్టుకున్న తర్వాత గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే మరికొందరు పెద్దపెద్ద ఆఫర్స్ వస్తే కూడా గ్లామర్ రోల్ చేస్తూ ఉంటారు కానీ సాయి పల్లవి మాత్రం మొదటి నుంచి ఇప్పటివరకు ఒకే విధంగానే సినిమాలలో నటిస్తున్నారని ఆమెలో ఏ మాత్రం మార్పు లేదని, ఇది కేవలం సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సందీప్ రెడ్డి మాటలకు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.