టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకుంటున్న థమన్ ను ఎప్పుడు వెంటాడే ఒక చేదు అనుభవం ఈ సారి కూడా వదల్లేదు. మరోసారి కాపీ విమర్శలు అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఏడాది అల.. వైకుంఠపురములో సినిమా ద్వారా బెస్ట్ ఆల్బమ్స్ అందించిన థమన్ అందులో కూడా కొన్ని కాపీ కొట్టేసినట్లు విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది.
ఇప్పుడు మరోసారి క్రాక్ సినిమాకు సంబంధించిన సాంగ్ ను కాపీ కొట్టేసి దొరికిపోయినట్లు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన చిత్రం క్రాక్. ఇక సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ ఇటీవల భల్లెగా తగిలావే బంగారం అనే పాటను రిలీజ్ చేశాడు. మొదటిసారి అనిరుధ్ రవిచంద్రన్ తో పాడించి మంచి హైప్ క్రియేట్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటలకే అది సెల్వా ఈఎల్ నియాన్ (selva El neon) సాంగ్ నుంచి కాపీ కొట్టినట్లు క్లారిటీ వచ్చేసింది.
ఆ సాంగ్ లో మ్యూజిక్ ను చాలా వరకు కాపీ కొట్టినట్లు నెటిజన్లు ట్రోలింగ్ తో ఆడుకుంటున్నారు. థమన్ కు ఇలాంటి కాపీ తిప్పలు కొత్తేమి కాదు. అప్పుడెప్పుడో వచ్చిన బిజినెస్ మెన్ నుంచి మొదలవుతూనే ఉంది. ఇక రేసుగుర్రం, ఆ తరువాత అల.. వైకుంఠపురములో వరకు కూడా అలానే కాపీ క్యాట్ అనే ముద్రకు ఛాన్స్ ఇస్తూ వస్తున్నట్లు ట్రోల్స్ వస్తున్నాయి. మరి ఈ సారి థమన్ ట్రోలింగ్ పై ఎలా క్లారిటీ ఇస్తాడో చూడాలి.