పద్మభూషణ్ మృణాల్ సేన్ ఓ అరుదైన దర్శకుడు

భారతీయ సినిమా ఓ మహనీయ దర్శకుణ్ణి కోల్పోయింది . మృణాల్ సేన్ . ఈ పేరు తెలియని సినీప్రియుడు ఉండరంటే అతిశయోక్తి కాదు . నిన్న మృణాల్ సేన్ కన్నుమూశారు . ఆయన వయసు 95 సంవత్సరాలు .

పద్మభూషణ్ మృణాల్ సేన్ . బెంగాలీ సినిమా తో పాటు భారతీయ సినిమాను కూడా సుసంపన్నం చేసిన సృజనాత్మక దర్శకుడు . తెలుగు సినిమా రంగంలో ఇద్దరు గొప్ప బెంగాలీ దర్శకులు  పనిచేశారు .1977లో”ఒకవూరి కథ ” సినిమాకు దర్శకుడు మృణాల్ సేన్ .

మరొకరు 1980లో “మా భూమి “చిత్ర దర్శకుడు గౌతమ్ ఘోష్ . ఈ ఇద్దరు భారతీయ సినిమాకు చిరస్మరణీయమైన చిత్రాలు అందించారు , స్థమా చిత్రాల ద్వారా దేశ ఖ్యాతిని పెంచారు . “ఒకవూరి కథ ” తెలుగులో సమాంతర సినిమాకు నూతన బాటలు వేసింది . సృజనాత్మక దర్శకుడు మృణాల్ సేన అతి సహజంగా తీసిన సినిమా ఇది.

జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నది . 1955లో మృణాల్ సేన్ మొదటిసారి దర్శకత్వం వహించాడు . ఆ సినిమా పేరు  “రాత్ బోరే ” (రాత్రి )2002లో చివరి సినిమా ” ఆమర్ భువన్ ” (మాతృ భూమి )

ఆయన దర్శకత్వం వహించ సినిమాలు తక్కువే కానీ అన్నీ ఆణిముత్యాలే . జాతీయ అవార్డులు,  రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు , ఫిలిం ఫేర్ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు  ఎన్నో మృణాల్ సేన్ ను వరించాయి .

వామ పక్ష భావజాలంతో  సహజమైన సినిమాలకు రూపకల్పన చేసి తనదైన ముద్ర భారతీయ సినిమా మీద వేసిన గొప్ప దర్శకుడు మృణాల్ సేన్ .