Kota Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు, కమెడియన్ కోటా శ్రీనివాసరావు తాజాగా ఆదివారం రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా రెండేళ్ళ క్రితం వరకు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
ఆయన చివరగా నటించిన సినిమా 2023లో రిలీజైన సువర్ణ సుందరి. కోటా శ్రీనివాస రావు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. దాదాపు 750 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. కమెడియన్ గానే మాత్రమే కాకుండా విలన్ గా, నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటివి గొప్ప నటుడు చనిపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
ఇప్పటికే ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న ప్రముఖులు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించాడు. కాగా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కోటా శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
