Karthi: డైరెక్టర్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన హీరో కార్తీ…. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన సత్యం సుందరం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కార్తీ సినిమాల విషయానికి వస్తే ఈయన సర్దార్-2(Sardar-2), ఖైదీ-2, వా వాతియార్ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా హీరో కార్తీ సత్యం సుందరం సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థార్ ROxx AX5L కారును ఆయనకు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇలా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కి కార్తీ అందించిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి ప్రేమ్ కుమార్ ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

మహీంద్రా థార్ ఎన్నాళ్ల నుంచో కలలు కంటున్నా. ఆచరణాత్మక కారణాల వల్ల నేను 5 డోర్ల వెర్షన్ కోసం ఎదురు చూశానని ముఖ్యంగా తనకు తెలుపు రంగు థార్ రాక్స్ AX 5L 4×4 వేరియంట్ కావాలని ఉండేది. దాని లాంచ్ తర్వాత, నేను దానిని కోనాలని అనుకున్నాను , కానీ నా కోరిక మాత్రం తీరలేదు ఇలా కార్తీ సార్ ద్వారా తన కోరిక నెరవేరింది అంటూ ఈయన సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇలా డైరెక్టర్ కు ఎంతో ఇష్టమైన కారును హీరో కార్తీ గిఫ్ట్ గా ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా నువ్వు సూపర్ అన్న అంటూ ఈ వీడియో ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ఈ కారు ఖరీదు సుమారు 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.