‘హెరిటేజ్ ఫుడ్స్ నాదే… చంద్రబాబు కొట్టేసాడు’: మోహన్ బాబు

‘హెరిటేజ్ ఫుడ్స్’ వ్యవస్థాపకుల్లో తాను కూడా ఉన్నానని, తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్న చంద్రబాబు, తన వాటాను కొట్టేశారని నటుడు మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు.

మోహన్ బాబు మాట్లాడుతూ… “చంద్రబాబుది అంతా కరివేపాకు పాలసీ. యూజ్‌ అండ్‌ త్రో. అదే ఆయన క్యారెక్టర్‌. ఎన్టీ రామారావుతో సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. నాకు చేసిన మోసం అదో చరిత్ర. హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాది.. నాది.. నాది ఎక్కువ శాతం అన్నారు మోహన్ బాబు.

తాను, చంద్రబాబు, దాగా అనే మరో మిత్రుడు కలిసి హెరిటేజ్ ని స్థాపించామని చెప్పిన మోహన్ బాబు, అధిక పెట్టుబడి తనదేనని, మిగతా ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని అన్నారు. కొన్ని రోజుల తరువాత తెల్లకాగితాలపై సంతకాలు చేయమని అడిగారని, ఎందుకని ప్రశ్నిస్తే, అప్పట్లో ఏదో చెప్పారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని అన్నారు.

కొన్నేళ్ల తరువాత నాకు హెరిటేజ్ సంస్థతో సంబంధం లేదని చెప్పారని, ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని అన్నారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.

తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్‌ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారి షాక్‌ తిన్నాను. కోర్టుకు వెళ్లాను. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశాను. ఓ సినిమా తీశాం. ఫెయిల్‌ అయ్యింది అనుకుని సరిపెట్టుకున్నాను. నా తరువాత దాగానూ అలాగే మోసం చేసి బయటకు పంపేశారు.

హెరిటేజ్‌ సంస్థ విషయంలో చంద్రబాబు మమ్మల్నే కాదు రైతులను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. చంద్రబాబు ఏం చేశారో తెలుసా. కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసేవారు. ఆ డబ్బును తనకు తెలిసిన కొందరు రైతులకు ఇచ్చేవారు. వాళ్లు హెరిటేజ్‌ కంపెనీలో షేర్లు కొన్నట్టు చూపించేవారు. కొన్నాళ్లకు మళ్లీ ఆ షేర్లను తానే కొనుక్కున్నట్లు డ్రామా నడిపించారు. హెరిటేజ్‌ సంస్థలో వాటాలు పెట్టినట్టు గానీ వాటిని చంద్రబాబుకు అమ్మినట్టు గానీ ఆ రైతులకే తెలియకుండా వ్యవహారం నడిపారు అని అన్నారు.

తనను మోసం హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ… ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు ప్రశ్నించారు.