వైరల్ : “గాడ్ ఫాదర్” ఈవెంట్ లో భారీ చోరీ..స్టోరీ ఏంటో చూడండి.!

మొన్ననే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాగాజా చిత్రం గాడ్ ఫాదర్ తాలూకా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో భారీ వర్షం చోటు చేసుకున్నా కూడా మెగాస్టార్ అయితే తన స్పీచ్ ని ఎక్కడా ఆపకుండా మాట్లాడి అభిమానులని మంచి ఉత్సాహాన్ని అందించారు.

సరే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఓ షాకింగ్ వార్త అయితే వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ కి తండోపతండాలుగా వెళ్లిన మెగా ఫ్యాన్స్ కి కేటుగాళ్లు షాకిచ్చారు. ఇదే ఈవెంట్ లోకి చొరబడిన దొంగలు ఏకంగా 300కి పైగా ఫోన్లు చోరీ చేసేసారట.

అయితే ఈ విషయం అభిమానులకి తర్వాత తెలియగా నాలుక కరుచుకున్నారు. దీనితో అక్కడ నుంచి వందలాది పోలీసు కేసులు స్టార్ట్ అవ్వడంతో ఈ షాకింగ్ ఘటన కోసం ఇప్పుడు వార్తలు బయటకి వచ్చి వైరల్ గా మారాయి. అయితే ఇది అంతా అక్కడ జస్ట్ గంటల వ్యవధిలోనే జరిగిపోయిందట.

మొత్తానికి అయితే గాడ్ ఫాదర్ ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ కి ఇలా షాక్ తగిలింది. ఇక ఈ చిత్రం అయితే ఈ అక్టోబర్ 5న గ్రాండ్ గా తెలుగు హిందీ, మలయాళంలో రిలీజ్ కానుంది.