ఓటిటి : కేవలం ఈ భాషల్లోనే డిజిటల్ గా వచ్చేసిన విజయ్ “లైగర్” చిత్రం.!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎలాంటి భారీ హిట్స్ చూశాడో అదే విధంగా తనకు మించి ఘోర పరాజయాలు కూడా చూశాడని చెప్పాలి. కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్ల తర్వాత స్టార్ గా మారిన ఈ యంగ్ హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యడానికి మాత్రం ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు.

అలాగే యూత్ లో కూడా తన ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. మరి అలా తాను ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన లేటెస్ట్ సినిమానే “లైగర్”. దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా అనౌన్స్ చేయడం ఒకెత్తు అయితే దీనిని ఏక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసుకోడం ఇంకో ఎత్తుగా మారింది.

దీనితో పాన్ ఇండియా లెవెల్లో అంతకంతకీ క్రేజ్ పెంచుకుంటూ వచ్చిన ఈ సినిమా తీరా రిలీజ్ అయ్యాక భారీ డిజాస్టర్ అయ్యింది. మరి ఈ సినిమా అయితే అయితే ఫైనల్ గా ఇప్పుడు ఓటిటి లో అనుకున్నట్టే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ లో ఈ చిత్రం సౌత్ భాషలు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చినట్టు ఇప్పుడు అధికారికం అయ్యింది. ఇంకా ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే మైక్ టైసన్ సహా రమ్య కృష్ణ తదితరులు సినిమాలో నటించారు.