లారెన్స్ తదుపరి చిత్రం 3d లో

‘కాంచన 3’ సూపర్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రాఘవా లారెన్స్‌. ప్రస్తుతం తన సూపర్‌ హిట్‌ చిత్రం ‘కాంచన’ సినిమాను అక్షయ్‌ కుమార్‌తో ‘లక్ష్మీ బాంబ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి లో ఆగిపోయిందని ప్రకటించారు లారెన్స్. మళ్లీ హీరో మరియు ప్రొడక్షన్ వాళ్లు లారెన్స్ అయితేనే బెటర్ గా తెరకెక్కించగాలడని అని లారెన్స్ ని దర్శకుడిగా తీసుకున్నారు

ఈ సినిమా తర్వాత సూపర్‌ హీరోగా లారెన్స్‌ ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని 3 డీలో భారీ బడ్జెట్ గా తెరకెక్కించే ఆలోచనలో లారెన్స్‌ ఉన్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సూపర్‌ హీరో సినిమాను సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తుందని సమాచారం.