“చంద్రముఖి 2” నుంచి హాట్ ఫస్ట్ లుక్ లో కంగనా.!

ఇండియన్ సినిమా దగ్గర హారర్ బ్యాక్ డ్రాప్ లో అయితే చాలా తక్కువ చిత్రాలే ఉంటాయి. కాగా వాటిలో ఉన్న కొన్ని చిత్రాలు అయితే సెన్సేషనల్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే దాదాపు సౌత్ ఇండియా సినిమా నుంచే పలు క్రేజీ థ్రిల్లర్ హిట్స్ ఉండగా ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన “చంద్రముఖి” అయితే అప్పట్లో ఒక బెంచ్ మార్క్ హిట్ గా నిలిచింది.

తెలుగులో కూడా విడుదల అయ్యి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మళ్ళీ ఇన్నాళ్ళకి అయితే సీక్వెల్ కి నోచుకుంది. అయితే ఈసారి యంగ్ హీరో రాఘవ లారెన్స్ నటించిన ఈ చిత్రాన్ని అదే దర్శకుడు పి వాసు అయితే తెరకెక్కించారు. కాగా ఈసారి చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ ని మేకర్స్ తీసుకోగా ఇపుడు ఈమె పై ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసిన ఈ లుక్ మరీ క్లాస్ గా కాకుండా ఓ హాట్ లుక్ లో రిలీజ్ చేశారు అని చెప్పాలి. చంద్రముఖి హాట్ షో చూపిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో దీనిని రివీల్ చేశారు. కొంతమంది కాస్త ఇంటెన్స్ లుక్ ని ఆశించి ఉండవచ్చు కానీ యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా చంద్రముఖి లోని మోహం ఎక్కించే లుక్ ని రివీల్ చేశారు.

ఇక ఈ చిత్రంలో కూడా కమెడియన్ వడివేలు నటిస్తుండగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఈ వినకయ చతుర్థి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి RRR సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం. అలాగే పాన్ ఇండియా వైడ్ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.