“గాడ్ ఫాదర్” వేడుక ఆపుతారా?ఇందిరా దేవి మరణం పట్ల మెగాస్టార్ దిగ్బ్రాంతి!

ఈ రోజు టాలీవుడ్ లో మరో షాకింగ్ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ మహేష్ కృష్ణ గారి భార్య అయినటువంటి ఇందిరా దేవి గారు ఈరోజు ఉదయం కన్ను మూయడం తెలుగు సినిమా దగ్గర తీరని విషాదంగా మారింది.

దీనితో తెలుగులో అనేక మంది సినీ ప్రముఖులు ఈ వార్త పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు సీనియర్ స్టార్ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషాద ఘటనపై స్పందించారు. “శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది.

ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ , సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు  మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.” అని చిరు సంతాపం వ్యక్తం చేశారు. అయితే టాలీవుడ్ లో ఇది ఊహించని ఘటన అది కూడా పెద్ద హీరో విషయంలో కావడం షాకింగ్ అని చెప్పాలి.

మరి ఈరోజు అయితే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ తాలూకా గ్రాండ్ ఈవెంట్ ఉంది. ఈ విషాదంలో వీరు సంబరాలు చేసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్న గా మారింది. దీనితో గాడ్ ఫాదర్ ఈవెంట్ ఆపుతారా అనే టాక్ మొదలైంది కానీ అధికారిక అప్డేట్ అయితే ఏది ఇప్పటి వరకు లేదు.