బిగ్ న్యూస్ : ఇక నుంచి పద్మ విభూషణ్ కొణిదెల చిరంజీవి 

1119010-chiru (1)

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు నుంచో ఎందరో దిగ్గజాలు ఉన్నప్పటికీ కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అనే సాధారణ మధ్య తరగతి కుర్రాడు ఎంట్రీ అయ్యిన తర్వాత తెలుగు సినిమా గతి మారింది. తాను చేసిన ఖైదీ తర్వాత నుంచి భారీ క్రేజ్ ని సొంతం చేసుకొని ఆ తర్వాత కళ్ళు మిరుమిట్లు గొలిపే డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టి తారా స్థాయిలోకి వెళ్లి మెగాస్టార్ అయ్యాడు.

అయితే తనకి ఇంత ప్రేమని ఇచ్చిన అభిమానులు కోసం ఏదన్నా చేయాలనే తపనతో రక్తదానం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి తన ప్రతి అభిమానిని కూడా రక్త ప్రదాతగా మార్చి గొప్ప కార్యానికి పూనుకున్నాడు అంతే కాకుండా నేత్రదానం విషయంలో కూడా ఎంతో అవేర్ నెస్ ని తీసుకొచ్చి చిరు ఎంతమందికి ఎన్నో సాయాలు అందించారు.

అక్కడ నుంచి ఇప్పుడు వరకు కూడా టాలీవుడ్ కి కానీ తన అభిమానులే అని కానీ కష్టాల్లో ఎవరు ఉన్నా కూడా చిరు తనదైన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. దీనితో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురష్కారాన్ని అందిస్తుంది అని ఆ మధ్య వార్తలు రాగ ఇప్పుడు ఇది ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజం అయ్యింది.

దీనితో విభూషణ్ పురస్కారం వచ్చిన రెండో టాలీవుడ్ నటుడుగా అలాగే సౌత్ నుంచి మూడో నటుడిగా మెగాస్టార్ ఇప్పుడు నిలిచి చరిత్రలో నిలిచారు. దీనితో సినిమా ప్రముఖులు మెగా అభిమానులు కుటుంబీకులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.