ఇండస్ట్రీ టాక్ : “NTR 30” హీరోయిన్ డైలమాలో కొరటాల..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు తన లాస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ లెవెల్ లోకి వెళ్ళింది. దీనితో నెక్స్ట్ ఎన్టీఆర్ చేసే సినిమాపై ఆటోమాటిక్ గా అంచనాలు ఉంటాయి. మరి వాటిని అయితే మ్యాచ్ చేస్తూ దర్శకుడు కొరటాల శివ చేసిన NTR 30 మోషన్ పోస్టర్ టీజర్ చూసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయ్యింది.

దెబ్బతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో మరింత మార్కెట్ పెంచుకోవడం ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ ఇప్పటి వరకు సినిమాపై ఎంతకీ ప్రోగ్రెస్ కనిపించలేదు. పైగా మరోపక్క హీరోయిన్ విషయంలో కూడా చాలానే డ్రామా నడిచింది.

కొరటాల ఏమో ఎవరొక బాలీవుడ్ హీరోయిన్ ని పెడదాం అని.. కానీ ఎవరు సెట్ అవ్వకపోవడం మేకర్స్ కి తలనొప్పిగా మారింది. కానీ లాస్ట్ ఛాయస్ గా రష్మికా మందన్నా మరియు కీర్తి సురేష్ ల పేర్లు వచ్చాయి.

అయితే ఇప్పుడు కొరటాల మరింత డైలమాలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ నుంచి టాక్. వీరిలో కూడా ఇంకా ఎవరూ అయితే సినిమాకి ఫిక్స్ కాలేదని అంటున్నారు. దీనితో అయితే ఈ సినిమాకి హీరోయిన్ కష్టాలు ఇంకా తీరేలా లేవని అనిపిస్తుంది. మరి లాస్ట్ కి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.