“RRR” జపాన్ భారీ రిలీజ్ చాలా స్పెషల్ ఎందుకంటే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోలు అందులోని రెండు డిఫరెంట్ కుటుంబాలు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్న మాస్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.

మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓటిటి లో వచ్చాక మరింత స్థాయిలో సెన్సేషన్ ని రేపింది. అయితే ఈ సినిమా జపాన్ రిలీజ్ అందులోని థియేటర్ రిలీజ్ కోసం అక్కడి ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా మేకర్స్ ను కూడా అడుగుతుండగా ఫైనల్ గా మేకర్స్ అయితే ఈ బిగ్ రిలీజ్ అనౌన్సమెంట్ ని ఇచ్చేసారు.

ఈ అక్టోబర్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయగా ఈ సినిమా రిలీజ్ అక్కడ చాలా స్పెషల్ గా మారింది. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్ సినిమాలకి గాని ఎన్టీఆర్ సినిమాలకి గాని భారీ క్రేజ్ ఉంది. చరణ్ నటించిన సినిమా “మగధీర” అయితే జపాన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు అందుకుంది.

ఇంకా ఎన్టీఆర్ కి అయితే తన డాన్స్ లు పరంగా చాలా ఎక్కువ మొత్తంలోనే అభిమానులు ఉన్నారు. పైగా ఎన్టీఆర్ పై అయితే అనేక డాన్స్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఇద్దరు స్టార్స్ ఉన్న సినిమా అంటే అక్కడి ఆడియెన్స్ ఏ లెవెల్లో చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంకా మరో అంశం ఏమిటంటే దర్శకుడు రాజమౌళి సినిమాలు అన్నా అక్కడ క్రేజ్ ఎక్కువే.. బాహుబలి సినిమాలు అక్కడ భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. అందుకే ఈ కాంబోపై వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా యూనిట్ కి జపాన్ రిలీజ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. మరి అక్కడి రిలీజ్ తో ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలని ట్రేడ్ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.