బాండ్ సినిమాకి ధీటుగా తెలుగు కుర్రాడి ప్రయత్నం
కొవిడ్ 19 మహమ్మారీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. దేశాలకు దేశాలు ఈ కల్లోలం కొట్టుకుపోయాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా గజగజ ఒణికింది. అయితే ఇంత పెద్ద కుట్ర చేసింది ఎవరు? అంటే ఇండియా- అమెరికా సహా ప్రపంచ దేశాలు చైనా వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ చేసిన వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగానే ఆరోపించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోని ఒక కీలక సభ్యుడు చైనా కు అండగా నిలిచి ప్రపంచంపై కుట్ర చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
వీటన్నిటి నేపథ్యంలో ఇదే తరహా కథాంశాలతో ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. తదుపరి జేమ్స్ బాండ్ రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ `నో టైమ్ టు డై` ఇదే తరహా కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం. కరోనా కుట్రకు కారణాల్ని కనిపెట్టి ప్రపంచాన్ని కనిపెట్టేవాడిగా బాండ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. టైటిల్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాండ్007 తాజా మూవీలో హీరో ఐదేళ్ల అమ్మాయికి తండ్రిగా కనిపిస్తాడు. కరోనావైరస్ కారణంగా మహమ్మారి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రయత్నించడంలో మలుపులు రక్తి కట్టిస్తాయిట. క్యారీ జోజి ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డేనియల్ క్రెయిగ్ యాక్షన్ పార్ట్ హైలైట్ గా ఉండనుంది.
అయితే కరోనా అనంతర పరిణామాలపై సినిమాలు తీస్తున్న తెలుగు కుర్రాడు `ఐ యామ్ గోనా టెల్ గాడ్ ఎవ్రీథింగ్` ఫేం దేవ్ పిన్నమరాజు బాండ్ మూవీ కథకు ధీటైన కథతోనే సినిమాలు తీస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడు తెరకెక్కిస్తున్న WHO కి బాండ్ సినిమాకి సారూప్యతలు ఉన్నాయని లీకులందాయి. ఎథికల్ హ్యాకింగ్ సహా పలు అంతర్జాతీయ అంశాల్ని అతడు టచ్ చేస్తున్నాడు. ప్రపంచంపై చైనా కుట్రల్ని.. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడి కుట్రల్ని కూడా బయటికి తీస్తున్నారట తాజా చిత్రంలో.