వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం వాల్మీకి. మాస్ ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని మరింత దగ్గరగా చేర్చేందుకు ఇందులో ఒక ఐటమ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి అనే తెలుగమ్మాయి తన స్టెప్పులతో అదరగొట్టనుందట.
ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీలక పాత్ర పోషించింది. వాల్మీకి చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించిన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.