ఇన్సైడ్ టాక్ : “లైగర్” నష్టాల్లో విజయ్ 6 కోట్లు వెనక్కి? అసలు నిజం తెలుసుకోండి!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర అలాగే పాన్ ఇండియా మార్కెట్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పుకొని రిలీస్ కి వచ్చిన భారీ చిత్రాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రం “లైగర్” కూడా ఒకటి.

దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ బ్రేక్ తీసుకొని చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిల్చిన సినిమాగా నిలిచిపోగా ఈ సినిమాపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా నడుస్తుంది. అయితే ఇదే క్రమంలో విజయ్ తన రెమ్యునరేషన్ నుంచి 6 కోట్లు వెనక్కి ఇచ్చేసాడు అని కొన్ని వార్తలు అయితే సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

దీనితో అందరు విజయ్ ని పైకి ఎత్తేస్తున్నారు. కానీ దీని వెనుక అసలు నిజం ఏంటి అనేది ఇన్సైడ్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా నష్టాల విషయంలో విజయ్ 6 కోట్లు కాదు కదా ఒక రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదట.

తాను 6 కోట్లు వెనక్కి ఇచ్చాడని ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఇదే ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజం.